బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (17:18 IST)

మునక్కాయలో ఏముంది? ఎవరికి మేలు చేస్తుంది?

మునక్కాయలో ఏముందో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. మునక్కాయలో ఫ్యాట్, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఉన్నాయి. ఇంకా కార్బొహైడ్రేట్ 3.7గ్రాములు, తేమ 86.9%, కెలోరీల 26, ఫైబర్ 4.8 గ్రాములు, ఫ్యాట్ 0.1, విటమిన్ ఎ 0.11 మి.గ్రాములు, క్యాల్షియం 30 మి. గ్రాములు, మెగ్నీషియం 24 మి.గ్రాములున్నాయి.  
 
ఎవరికి మేలు చేస్తుంది?
పిల్లలకు మునక్కాయ ఎంతో మేలు చేస్తుంది. మెదడు వాపు, జలుబు, రక్తహీనత, ఉదర సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత రోగాలను మునక్కాయ నయం చేస్తుంది. అయితే వృద్ధులకు, హృద్రోగులు, మోకాలి నొప్పితో బాధపడే వారు మాత్రం మునక్కాయను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ప్రయోజనాలేంటి? 
నరాలను ఉత్తేజపరుస్తుంది. మునక్కాయను వారంలో రెండుసార్లు తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలుండవు. తలనొప్పి, కిడ్నీ రోగాలు దరిచేరవు. గర్భిణీ మహిళలు మునక్కాయను తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ప్రసవానికి ముందు, తర్వాత ఏర్పడే ఆరోగ్య సమస్యలను ఇది నయం చేస్తుంది. ప్రసవం తర్వాత మునక్కాయ తీసుకుంటే తల్లిపాలు పడతాయి. జలుబు దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.