మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (18:26 IST)

ఒత్తిడికి చెక్ పెట్టాలా? తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి!

ఆధునికత పేరుతో బిజీ బిజీ అంటూ అందరూ ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారు. తద్వారా మానసిక, ఆరోగ్య సమస్యలు తప్పట్లేదు. అందుచేత ఒత్తిడికి చెక్ పెట్టాలంటే ముఖ్యంగా అల్పాహారం తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 
 
అల్పాహారం తీసుకున్న వారిని తీసుకోని వారి ఒత్తిడిని పోలిస్తే తక్కువ శాతం నమోదైనట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్పాహారాన్ని తీసుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
టెన్షన్, పనిభారం, ఒత్తిడి, బాధ కలిగినప్పుడు మన శరీరంలోని కొన్ని ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ సమయంలో మన శరీరంలో ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. అలాంటప్పుడు మన శరీరానికి శక్తి లేక అలసటతో కూడిన అనుభూతి కలుగుతుంది.
 
ఆ సమయంలో ఒత్తిడిని అరికట్టేందుకు స్వీట్ స్నాక్స్ తినటం ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. స్వీట్ స్నాక్స్ ఒత్తిడి సంబంధిత హార్మోన్ల ఉత్పత్తి, వేగాన్ని తగ్గిస్తాయి. 
 
అల్పాహారంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం వలన ఒత్తిడిని తగ్గించవచ్చు. ఒత్తిడి తగ్గించటానికి ఆరోగ్యకరమైన ఆహారాలలో పండ్లు, బెర్రీలు, డార్క్ చాక్లెట్, పాల ఉత్పత్తులు మొదలైనవి తీసుకోవచ్చు. ఈ ఆహారాలు ఒత్తిడి సంబంధిత రుగ్మతలను తగ్గిస్తాయి.
 
అల్పాహారం ఒత్తిడి అరికట్టడంతో పాటు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు, శరీరానికి విశ్రాంతి ఇచ్చేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి అల్పాహారంతో అనేక రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.