శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (16:04 IST)

మొటిమలకు చెక్ పెట్టాలా? ఈ ఫుడ్ తీసుకోకండి!

ముఖారవిందాన్ని పాడు చేసేది మొటిమలు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మొటిమలను అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోండి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకండి. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయంటున్నారు వైద్యులు. 
 
కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదంటున్నారు ఆరోగ్యనిపుణులు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినకండి. కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చు. 
 
ప్రధానంగా నీటికి మించిన పదార్థం మరొకటి లేదు. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది కొద్దిగా త్రాగండి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగండి.