శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (17:54 IST)

స్మార్ట్‌గా ఉండాలా? కూల్‌డ్రింక్స్ వద్దు.. ఫ్రూట్ డ్రింక్సే ముద్దు!

స్మార్ట్‌గా ఉండాలా? కూల్‌డ్రింక్స్ వద్దు.. ఫ్రూట్ డ్రింక్సే ముద్దు! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. షాపుల్లో, సూపర్ మార్కెట్లలో అమ్మే కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెగ తాగేయడం కంటే ఫ్రెష్ జ్యూస్‌లోనే ఆరోగ్యం దాగివుందని వారు అంటున్నారు. 
 
కూల్ డ్రింక్స్‌లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్‌తోనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా స్మార్ట్‌గా ఉంటారని, నీరసం ఉండదని, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇంకా చర్మకాంతి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వీటిలో దానిమ్మ, బెర్రీ జ్యూస్, ఎక్కువ నీరు, బీట్ రూట్, క్యారెట్ జ్యూస్, ఆపిల్ జ్యూస్, కొబ్బరినీళ్లను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలి. ముఖ్యంగా బెర్రీస్ మరియు బ్లూబెర్రీస్ రెండింటిలోనూ బ్రెయిన్‌కు సంబంధించిన న్యూరోనల్ యాక్టివిటిని మెరుగుపరిచే గుణాలున్నాయి.
 
అలాగే యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్‌ను వారానికి మూడుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట ఆవహించదని వారు సూచిస్తున్నారు.