గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (15:26 IST)

'మిస్డ్ కాల్' వచ్చిందా... టీనేజ్ అమ్మాయిలూ.. జాగ్రత్త...!

నేటి ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ అత్యవసరంగా మారింది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అనేక సమస్యలను తీసుకువస్తుంది. కొన్ని సార్లు జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు, అమ్మాయిలు మొబైల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సెల్ ఫోన్‌లు మనిషి మెదడుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. 
 
ముఖ్యంగా మొబైల్ ఫోన్‌కు మిస్డ్ కాల్‍ వస్తే తేలిగ్గా తీసుకోవాడనికి లేదు. అమ్మాయిల కిడ్నాప్‌లూ, వారిపై అత్యాచారాలు జరగడానికి ఈ మిస్డ్ కాల్సే కారణం అని పలు అధ్యనాల్లో తేలింది. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిల్లో చాలా మంది తమకు వచ్చిన ఇలాంటి మిస్డ్‌కాల్స్‌కి తిరిగి ఫోన్ చేయడం, పరిచయాలు పెంచుకోవడం, చివరకు మృగాళ్ల వలలో చిక్కుకుని మోసపోవడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. 
 
కర్ణాటక ప్రభుత్వం ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోందట. ఇందుకోసం ఒక ప్రకటనను కూడా వెల్లడించింది. అందులో.. స్కూళ్లు, కాలేజీల్లో సెల్ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. 18 ఏళ్లు దాటినవాళ్లే సెల్‌ ఫోన్లను వాడుకోవచ్చని చెబుతోంది. అంతేకాదు పోలీసుల పనితీరులో పారదర్శకత ఉండేట్లు వాటిల్లో సీసీటీవీల ఏర్పాటు జరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు వహించినప్పటికీ అమ్మాయిలు అనుకుంటేనే సెల్‌ఫోన్ల ద్వారా ఏర్పడే అనర్థాలను రూపుమాపగలమని అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు.