శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:13 IST)

అల్లం పొడి, తేనె మిక్స్ చేసి తీసుకుంటే!

జింజర్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ-ఇంఫ్లమేటరీ, యాంటీ-మిక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండి, ఈ పదార్ధం మూత్రపిండా ఇన్ఫెక్షన్ల ఉపసమనానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రతిరోజూ ఉదయం సాయంత్రం జింజర్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జింజర్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. తద్వారా శోషణ, ఆహార పోషకాల సమీకరణంలో కీలక పాత్రను పోషించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. 
 
ఇది ఆహారంలో ఉండే ప్రోటీన్లను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. జింజర్ కణాల మరణాన్ని ప్రేరేపించే సామర్ధ్యాన్ని (అపోప్తోసిస్), కాన్సర్‌కు కారణమైన ప్రోటీన్ మాలిక్యూల్ చర్యలను కూడా నిరోధించే సామర్థ్యం కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అయినప్పటికీ జింజర్ వివిధ రకాల కేన్సర్లను అరికడుతుంది, ఇది ఓవరియన్ కాన్సర్‌ను అద్భుతంగా నివారిస్తుంది. ఆకలిగా అనిపించకపోతే, భోజనానికి ముందు కొద్దిగా అల్లం పొడికి, తేనెమిక్స్ చేసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.