శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:30 IST)

బరువు తగ్గించాలంటే.. ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోండి.!

బరువు తగ్గించాలంటే.. ఈటింగ్ హ్యాబిట్స్ మార్చుకోండి అంటున్నారు న్యూట్రీషన్లు. బరువు తగ్గడం కోసం ఆహారం తీసుకోకమానేయడం.. వ్యాయామం చేయడం కంటే హెల్దీ ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ఆహారం తీసుకోవడంలోనూ ఓ పద్ధతి ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సో బరువు తగ్గాలంటే ఎలాంటి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫాలో కావాలో చూద్దాం.. 
 
* ఆకలి కాక ముందే తినేయండి. ఆకలి కాకముందే తినడం వల్ల అతిగా తినడం నివారించవచ్చు. భోజనానికి ముందు ఒక గ్లాస్ నీరు త్రాగడం వల్ల మీకు ఎక్కువ ఆకలి అనిపించదు.
 
* తీసుకొనే ఆహారంలో ప్రతీ ముద్దను బాగా నమిలి తినాలి. ఆహారం తీసుకునేటప్పుడు ఆందోళన, హడావుడి ఉండకూడదు.  
 
* కంటికి కనబడిన... ఇష్టమైన ఆహారాన్ని అమితంగా తీసుకోకూడదు. పొట్టకు సరిపడినంత మాత్రమే తినాలి. 
 
* రెగ్యులర్ డైట్లో అదనపు క్యాలరీలను జోడించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సోడా లేదా కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్‌ను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. కూల్ డ్రింక్స్‌కు బదులుగా నీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. 
 
* ఉదయం అల్పాహారాన్ని మానేయకూడదు. 
* వెరైటీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి 
* సీఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి
* ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. 
* వెజిటబుల్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించాలి.
* ఆహారం తీసుకునేటప్పుడు పరిమాణాన్ని తగ్గించాలి.