బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2014 (18:46 IST)

గ్రీన్ బ్రోకోలీ ఎముకలకు బలాన్నినిస్తుందట!

అవునండి గ్రీన్ కలర్ బ్రోకోలీలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. ముఖ్యంగా పిల్లలు అధికంగా బ్రోకోలీని తీసుకోవడం ద్వారా ఎముకల పెరుగుదల సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు బ్రోకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇతర కూరగాయల్లో కంటే, బ్రొకోలీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ క్యాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. 
 
ఇంకా యాంటీ క్యాన్సర్‌గానూ బ్రోకోలీ పనిచేస్తుంది. శరీరంలోని క్యాన్సర్ కణాలను నశింపజేయడంలో బ్రోకోలీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరానికి అవసరమయ్యే ఎంజైములకు రక్షణ కల్పించే బ్రోకోలీ క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్‌ను శరీరం నుంచి వెలివేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.