బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (14:46 IST)

గ్రీన్ టీ తాగండి.. హార్ట్ రేటును పెంచుకోండి.!

గ్రీన్ టీని తాగండి.. హార్ట్ రేటును పెంచుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ చల్లని లేదా వేడి ఏదైనా సరే బరువు తగ్గడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
 
శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. హార్ట్ రేటు పెంచుతుంది. కొన్ని పరిశోధన ద్వారా, క్యాన్సర్ నివారించడానికి, శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి గ్రీన్ టీ చాలా సహాయపడుతుందని తేలింది. పొట్టలోని పెద్ద ప్రేగులోని చెడు బ్యాక్టీరియాను ఎదుర్కొనే మంచి బ్యాక్టీరియా గ్రీన్ టీలో ఉన్నాయి
 
అలాగే క్యాబేజీ ఉత్తమ యాంటీబయోటిక్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. 
 
ఇకపోతే.. సీఫుడ్స్‌లో ది బెస్ట్ ఫుడ్ సాల్మన్ ఫిష్. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3యాసిడ్స్, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఇది నొప్పిని నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి సాల్మన్ ను బేక్ చేసి, గ్రిల్ చేసి లేదా రోస్ట్ చేసి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.