శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (16:47 IST)

ఆందోళనను తగ్గిపోవాలంటే.. చిక్కుడు తీసుకోండి!

చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్నారా? ఆందోళనలో ఉన్నారా? అయితే వారానికి రెండు, మూడుసార్లైనా మీ డైట్‌లో చిక్కుడు చేర్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీన్స్‌లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనస్సును ఆహ్లాదంగా ఉంచడంతో పాటు మీ మూడ్‌ను మార్చడం.. ఆందోళనలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
అంతేగాకుండా చిక్కుడులోని పోషకాంశాలు గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చిక్కుడులో డైటరీ ఫైబర్ మరియు సోలెబుల్ మరియు ఇన్ సోలబుల్ కలిగి ఉంటాయి. సోలుబుల్ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను, అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. తద్వారా హృద్రోగ సమస్యలతో పాటు క్యాన్సర్ వ్యాధులను చిక్కుడు దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.