గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:04 IST)

గుండె ఆరోగ్యాన్ని కాపాడే స్వీట్ కార్న్!

స్వీట్ కార్న్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నను రెగ్యులర్‌గా మితంగా తీసుకోవడం ద్వారా తీసుకోవడం వల్ల గుండె రక్తకణాల ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.
 
స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. స్వీట్ కార్న్‌లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో శరీరానికి ముఖ్యంగా అవసరమయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. 
 
స్వీట్ కార్న్‌లోని ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం హార్ట్ రేట్‌ను నార్మల్‌గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.