గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:41 IST)

సీజన్ ఫ్రూట్స్ తింటున్నారా? మామిడిని మానేయకూడదు!

ఆయా సీజన్లో దొరికే తాజాపండ్లలో పౌష్టిక విలువలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని, వాటిని ఆ ఋతువులోనే తినాలని ప్రకృతి నిర్దేశిస్తోందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. మన శరీరానికి ఆయా ఋతువులను బట్టి కొన్ని పోషకాలు అవసరమవుతాయి. కాబట్టి కొన్ని ఋతువులలో కొన్ని రకాల పండ్లనే ప్రకృతి ప్రసాదిస్తుంది. బరువు పెరిగిపోతామనో, నడుము పెరిగిపోతుందనో మామిడి పండ్ల సీజన్ అయిన మే నెలలో మామిడి పండ్లను తినడం మానేయకూడదు. 
 
ఈ పండ్లలోని విటమిన్ సి, బీటాకెరోటిన్ ఇతర అత్యవసర పోషకాలు సమృద్ధిగా శరీరానికి అవసరమవుతాయి. డిసెంబరులో కానీ, సీజన్‌కాని సీజన్లో మామిడి పండ్లు దొరికి వాటిని తిన్నప్పటికీ.. మే నెలలో తింటే లభించే తినడం ద్వారా లభించే ప్రయోజనాలు సమకూరవు. అదీగాక ఆ పండు అసలు రుచిని ఆస్వాదించలేకపోవచ్చు.