గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (19:01 IST)

సలాడ్స్ తీసుకోండి.. బరువు తగ్గండి..!

పండ్లు, కూరగాయలతో తయారుచేసుకునే సలాడ్స్ ద్వారా ఫైబర్‌ను పొందవచ్చు. సలాడ్స్‌కు తాజా పండ్లు, కూరగాయల్నే ఉపయోగించాలి.

రెగ్యులర్‌గా తీసుకొనే ఈ ఫుడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. సలాడ్స్‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి, సలాడ్స్‌లో బేరిపండ్లు, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్, పీచెస్, ఆపిల్స్, క్యారెట్, టమోటో, పెప్పర్, పీస్‌ను జోడించడం మంచిది. 
 
సలాడ్స్‌లో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం ద్వారా వృద్ధాప్య ఛాయలను నివారించుకోవచ్చు. రెగ్యులర్ డైట్‌లో ఆకుకూరలతో పాటు లెట్యుస్ చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఎ లోపంతో బాధపడే వారికి ఈ సలాడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. 
 
ఫైబర్ అధికంగా ఉండే ఫ్రూట్,  వెజ్ సలాడ్స్ తిన్నప్పుడు బరువు తగ్గించడంలో ఇవి అంతర్ఘతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకొనే వారు సలాడ్స్‌ను తీసుకోవడాన్ని మరిచిపోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.