గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:49 IST)

ఎక్కువ గంటలు కూర్చుంటే.. అంతే సంగతులు!

మామూలుగా అయితే నిలుచుని నడుస్తున్నప్పుడు శరీరంలోని అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్‌ను, కొవ్వు పదార్థాలను సంగ్రహిస్తాయి. అయితే ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం ద్వారా  రక్తనాళాలు తమ సహజమైన సంకోచ వ్యాకోచ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ స్థితి ఎక్కువకాలం సాగితే అది శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగడానికి, మధుమేహం రావడానికి దారి తీస్తుంది.
 
మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. చివరికి గుండె రక్తనాళాలు దెబ్బతిని గుండె జబ్బులకు దారి తీస్తుంది. కూర్చునే పనిచేస్తే గుండె జబ్బులు, పక్షవాతాలే కాకుండా కేన్సర్ బారిన పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు. 
 
ఆఫీసులో కావచ్చు, వ్యాపార సంస్థలో కావచ్చా లేదా టీవీ  ముందు కావచ్చు. రోజుకు 14గంటల పాటు కూర్చుని లేదా పడుకుని వారిలో  గుండె జబ్బులు తప్పనిసరి. ఇలాంటి వారు వ్యాధుల బారిన పడతారు.