శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (18:09 IST)

వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? క్యారెట్ జ్యూస్ తాగండి!

క్యారెట్‌లో ఉండే విటమిన్స్, మినిరల్స్, లోక్యాలరీలు బరువు తగ్గించడంలో గ్రేట్‌గా పనిచేస్తాయి. అలాగే టీ బ్రేక్ లో క్యారెట్ ముక్కలు తీసుకుంటే మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. క్యారెట్ జ్యూస్ కూడా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. క్యారెట్ జ్యూస్ రోజూ ఓ గ్లాసుడు తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధి కావడంతో పాటు బ్లడ్ యాసిడ్స్ లెవల్‌ను మెరుగుపరుస్తుంది. 
 
ఫర్ఫెక్ట్ ఐ హెల్త్ కోసం క్యారెట్ సూపర్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే క్యారెట్‌లో కళ్ళ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఎ గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇక క్యారెట్‌లో బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హెల్తీ స్కిన్ పొందడానికి చాలా గ్రేట్‌గా పనిచేస్తుంది. ఇంకా ముడతలను నిరోధిస్తుంది. క్యారెట్స్‌లో ఉండే ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, లుటిన్ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
 
ఇకపోతే.. గొంతు నొప్పిని నివారించడంలో క్యారెట్ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా సైనటీస్‌తో బాధపడే వారికి క్యారెట్ జ్యూస్ మెరుగ్గా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.