శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (13:30 IST)

ఆహారం విషతుల్యమైతే... వాంతులు కావచ్చు.. జాగ్రత్తలు పాటిస్తే సరి..

మనం తీసుకునే ఆహారం విషంగా మారినట్లైతే వెంటే వాంతులు ఏర్పడతాయి. ఆహారం ఎంత ఆరోగ్యకరమో.. అది విషమైతే అంత ప్రమాదకరం కూడా. ఆహారం ఉన్న చోట శుభ్రంగా లేకున్నా, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం లోనూ వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు కలిసి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు దేహం దానిని వీలయినంత త్వరగా వాంతులు, విరేచనాల రూపంలో విసర్జిస్తుంది. దీనినే ఫుడ్ పాయిజనింగ్,  ఫుడ్ బోర్న్ ఇల్‌నెస్‌గా వ్యవహరిస్తాం.ఈ సమస్యకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.

వాంతులు ఏర్పడినప్పుడు తులసి ఆకుల రసం ఒక కప్పు తీసుకోవాలి. ఇది కడుపులో చేరిన విషాలను తొలగించి జీర్ణవ్యవస్థను గాడిలో పెడుతుంది. ఈ సమయంలో వీలయినంత ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఈ విధంగా ద్రవాహం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్త విశ్రాంతి పొందుతుంది. గంటకోసారి ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే దేహం శక్తిని పుంజుకుంటుంది. 
 
వాంతులవుతున్నప్పుడు కాఫీ, టీలను పూర్తిగా మానేయాలి. పాలను కూడా తీసుకోకపోవడం మంచిది. పూర్తిగా నయమయ్యేంత వరకు బాగా పండిన అరటి పండ్లు, బియ్యం ఉడికించిన జావ, మజ్జిగన్నం తీసుకోవాలి. ఇటువంటి సమయంలో పచ్చి కూరగాయలు, హాఫ్ బాయిల్డ్ ఫుడ్‌ను, మాంసాహారాన్ని అసలు తీసుకోకూడదు. వాంతుల తీవ్రత ఎక్కువగా ఉండి. ఎంతకీ అదుపు కాకపోతే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడడం శ్రేయస్కరం.