శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (18:08 IST)

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి!

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకోండి! అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వీటిలో మొదటిది దానిమ్మపండు. దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారాలుగా ఉన్నాయి.

దానిమ్మ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి.
 
ఇకపోతే.. ద్రాక్షపండులో ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇవి ఊపిరితిత్తుల్లో కణితుల పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. పొగతాగేవారికే ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇవి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి.
 
క్యారెట్లు శ్వాస సమస్యలు నిరోధించడానికి సహాయం చేసే అద్భుతమైన ఆహారాలలో ఒకటి. దీనిలో A, C విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ రెండు విటమిన్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.