బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2014 (18:01 IST)

వేడి వేడిగా టీ, కాఫీలు తాగితే.. క్యాన్సర్‌తో ప్రమాదమే!

కాఫీ, టీలు, వేడి పానీయాలు వేడిగా తాగటానికి కొందరు ఇష్టపడతారు. ఎంత వేడిగా తాగితే అంత బాగుంటుందంటారు. చలికాలంలోను, వర్షాకాలంలోను వేడి పానీయానికి డిమాండ్ మరింతగా ఉంటుంది. అయితే అంత వేడిగా తాగడం మంచిది కాదు. వేడిగా తీసుకునే ద్రవ పదార్థాలు నాలుకను కాల్చినట్లు చేయడమే కాదు.. అది లోపలికి దిగినంత మేర అన్నవాహిక మీద ప్రభావం చూపుతుంది. 
 
టీ, కాఫీల వేడి అన్నవాహిక పై పొరమీద ప్రభావం చూపుతుంది. తద్వారా కణాలు దెబ్బతినడం లేదా పెరగడం మొదలెట్టి క్యాన్యర్‌కి కారణమవుతాయి. గొంతు క్యాన్సర్‌కి వేడి వేడి టీ, కాఫీ తాగే అలవాటుకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుచేత వేడి వేడిగా ద్రవ పదార్థాలను చల్లారాక తీసుకోవడం లేదా మితమైన వేడిగా తీసుకోవడం బెటరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.