శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (18:11 IST)

క్యాన్సర్ కణాలకు చెక్ పెట్టాలా? గ్రీన్ టీ తాగండి!

క్యాన్సర్ కణాలను నిరోధించాలంటే.. గ్రీన్ టీ తాగాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ తాగడం ద్వారా కొత్త ఉత్సాహం లభించడంతో పాటు.. క్యాన్సర్ సెల్స్‌ను డామేజ్ చేసే సత్తా గ్రీన్ టీకి ఉందని వారు అంటున్నారు. గ్రీన్ టీలో ఆరు ఫ్లవనాయిడ్స్ ఉన్నాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తోంది. గ్రీన్ టీ మిమ్మల్ని నిత్యయవ్వనులుగా ఉంచుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
శరీరంలోని అనవసర కొవ్వును కరిగించి బరువును నియంత్రిస్తుంది. గ్రీన్ టీ మెదడును చురుగ్గా ఉంటుంది. ఇంకా గ్రీన్ టీలో దాగివున్న ఆరు ఫ్లావోనాయిడ్స్ క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తాయి. శరీరంలో ఎంజైముల పెరుగుదలను నిరోధించే బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్టొమెక్ క్యాన్సర్‌, బ్రెస్ట్ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. ఇంకా రక్తంలోని ఇన్సులిన్లను గ్రీన్ టీ పెంచుతుంది. 
 
రక్తపోటు, పక్షవాతం, అల్జీమర్స్‌కు చెక్ పెడుతుంది. ఎముకలను బలపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ మానసిక ఒత్తిడిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతనిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.