మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 జనవరి 2015 (16:03 IST)

జంక్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తెలివి తగ్గిస్తాయట!

జంక్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే పిల్లలు ఇష్టపడి తినేస్తున్నారా..? అయితే జాగ్రత్త పడండి. జంక్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తెలివితేటలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
జంక్‌ఫుడ్ ఎక్కువగా తినే వారిలో బ్రెయిన్‌లోని రసాయనాలు మార్పు చెందుతాయి. దాంతో డిప్రెషన్ ఆతురత సంబంధ లక్షణాలకు దారితీస్తుంది. అంతే కాకుండా, ఈ ఆహారాల్లో ఉండే కొవ్వులు, వాటిని తినడం వలనే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. 
 
డొపమైన్ ఉత్పత్తి, ఆలోచనలను, పాజిటివ్ థింకింగ్‌కు ప్రోత్సహించే ముఖ్యమైన రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా డోపమైన్ కూడా అభిజ్ఞాత్మక విధిలో, లర్నింగ్ కెపాజిటి(నేర్చుకొనే సామర్థ్యం), చురుకుదనం, ప్రేరణ మరియు మెమరీ తగ్గిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల, అధిక కొవ్వులు కలిగి ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. 
 
అలాగే ప్రొసెస్ చేసి వేయించిన ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఫ్రైచేసిన మరియు ప్రొసెస్ చేసిన ఆహారాలు నెమ్మదిగా మెదడులోని నరాల కణాలను నాశనం చేస్తుంది. అయితే , కొన్ని నూనెలు ఇతరనూనెల కంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయని వారు అంటున్నారు.