శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (16:22 IST)

ఆ మూడు రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...తినాల్సిన ఆహారం.. కొన్ని చిట్కాలు..

సాధారణంగా రుతుక్రమ రోజుల్లో మహిళ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా పొత్తు కడుపులో తీవ్రమైన నొప్పులు, కాళ్ళు చేతులు లాగడం, తల తిరుగుడు, మరి కొందరిలోనైతే వాంతులు కూడా ఏర్పడుతుంటాయి. తద్వారా రుతుక్రమం అనేది కొందరు మహిళలకు శాపతంగా భావిస్తుంటారు. అయితే దీని గురించి బెంగపడాల్సి అవసరం లేదు. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. 
 
ఈ రోజుల్లో శరీరం ఫ్లూయిడ్స్‌ని కోల్పోతుంది కాబట్టి తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి మిగతా రోజుల కన్నా పిరియడ్స్ రోజులలో మంచినీరు కాస్త ఎక్కువగా తగాలి. కాఫీ, టీలని దూరంగా పెట్టడం మంచిది.
 
నీరసంగా ఉండడంతో లేచి ఏ పనీ చేయలేరు. అటువంటి సమయంలో ఐరన్ శక్తి చాలా అవసరం. అందువలన ఐరన్ శక్తి పుష్కలంగా ఉండే ఆకు కూరలను ఆ మూడు రోజులు తప్పనిసరిగా తినాకి.
 
ఆ రోజుల్లో మహిళలకు మూడ్ స్వింగ్స్ ఉంటాయన్న విషయం తెలిసిందేగా. వాటి నుంచి బయటపడటానికి అరటి పండు మంచి ఔషధం. పొటాషియం, బి6 విటమిన్‌తోపాటు అరటిపండులో వుండే ఇతర విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి. దాని వలన మూడ్ స్వింగ్స్ తగ్గి హుషారుగా వుంటారు.
 
చిక్కుడు కుటుంబానికి చెందిన బీన్స్ వంటి గింజ ధాన్యాలలో ఐరన్ శాతం ఎక్కువ. వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరక సమతౌల్యం త్వరగా పొందచ్చు.
 
రుతుక్రమ సమయంలో డార్క్ చాక్లెట్‌లో వుండే మెగ్నీషియం వుండటమే కాకుండా, ఫీల్‌గుడ్ కెమికల్ అయిన సెరిటోటిని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి పిరియడ్స్ సమయంలో ఓ చిన్న డార్క్ చాక్లెట్ తింటే చికాకు పోయి హాయిగా అనిపిస్తుంది.
 
మొత్తం మీద పిరియడ్స్ రోజులలో మెగ్నీషియం, ఐరన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, చేపలు, నట్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పండ్లు వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యంగా వుండచ్చు.