గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:44 IST)

నిమ్మలో ఉన్న మేలెంత? ఆరోగ్య ప్రయోజనాలేంటి?

నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో 5శాతం సిట్రిక్ ఆసిడ్ ఉంది. నిమ్మలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు దాగివున్నాయి. నిమ్మకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఒబిసిటీ, అలెర్జీ, మొటిమలకు చెక్ పెట్టొచ్చు. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండి, తేనె కలుపుకుని తాగితే పేగులోని మలినాలను తొలగించినట్లవుతుంది. 
 
నిమ్మరసంతో కాసింత తులసి, తేనె కలుపుకుని తాగితే.. గొంతునొప్పి నయం అవుతుంది. శరీరంలో సెల్ డామేజ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వృద్ధాప్య ఛాయలను నయం చేస్తుంది. ఇందులోని పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది. నిమ్మలో విటమిన్ సి ఉండటం చేత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగడం ద్వారా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 
 
రోజూ వ్యాయామానికి తర్వాత ఒక గ్లాసుడు నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా బలం చేకూరుతుంది. ఇంకా రోజూ నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. నీరసం, అలసట, మానసిక ఒత్తిడి ద్వారా వచ్చే తలనొప్పికి చెక్ పెట్టాలంటే.. లెమన్ టీ తీసుకోవడం మంచిది. 
 
ఒక గ్లాసుడు నీటిలో ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసి పిల్లలకు ఇస్తే కడుపునొప్పి మాయమవుతుంది. గాయాలను సైతం నిమ్మ సులువుగా మాయం చేస్తుంది. గాయం తగిలిన చోట, చాకు పడ్డ చోట నిమ్మరసాన్ని రాస్తే గాయాలు మానిపోతాయి. నిమ్మరసాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.