శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (17:57 IST)

కంటికి మేలు చేసే ఆహార పదార్థాలేంటో తెలుసా?

సాధారణంగా కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యంగా పచ్చగా ఉండే వెజిటబుల్స్‌ను రోజువారీ డైట్‌లో అధికంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రోజూ కంటిని సంరక్షించే ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

పచ్చరంగుల్లో ఉండే కాయకూరల్లో విటమిన్ ఎ, సి, ఐరన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి కంటికి మేలు చేస్తాయి. రోజూ ఓ కప్పు ఆకుకూరలతో చేసే వంటకాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేకుంటే వారానికి రెండు సార్లైనా ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. 
 
ఆకుకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పచ్చి కూరగాయలతో సలాడ్స్ తయారు చేసుకుని తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని నిరోధించవచ్చు. ముఖ్యంగా నిమ్మ, క్యారెట్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఎ కంటిని కాపాడటంలో బాగా పనిచేస్తుంది. ఈ విటమిన్ ఎ పండ్లు, పచ్చని కూరగాయల్లో పుష్కలంగా ఉంటాయి. 
 
కరివేపాకు, క్యారెట్ కంటి రక్షణకు ఉపయోగపడ్తాయి. ఇవి రెండు కంటికి సూపర్ బాడీగార్డ్స్‌గా పనిచేస్తాయి. టమోటా, లివర్, కోడిగుడ్డు, కూరగాయలు, క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు కంటికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.