గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (18:01 IST)

చికెన్, డార్క్ చాక్లెట్‌తో లోబీపీకి చెక్ పెట్టండి.!

చికెన్, డార్క్ చాక్లెట్‌తో లోబీపీకి చెక్ పెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్కిన్ తొలగించిన మాంసాహారం. చికెన్, ఫిష్ వంటి ఆహారాలు లోబిపి ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి. లోబ్లడ్ ప్రెజర్‌కు ఇది ఒక బెస్ట్ ఫుడ్‌గా పనిచేస్తుంది. అలాగే చాక్లెట్ కూడా లోబీపీకి మంచి ఔషధంగా పనిచేస్తుంది.  
 
చాక్లెట్ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. లోబ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరం అయ్యే శక్తిని, వ్యాధినిరోధకతను వెంటనే అందించే నట్స్‌ను తీసుకోవాలి. ఇవి చాలా వరకూ అన్ని రకాల బ్లడ్ ప్రెజర్‌ను రెగ్యులేట్ చేస్తాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్‌లో చాలా ముఖ్యమైన మినిరల్స్‌తో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను రెగ్యులేట్ చేస్తుంది. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది తక్షణ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి