బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (17:53 IST)

జలుబుకు చెక్ పెట్టాలంటే.. సలాడ్స్, స్ట్రాబెర్రీస్ తీసుకోండి!

జలుబుకు చెక్ పెట్టాలంటే.. సలాడ్స్, స్ట్రాబెర్రీస్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సలాడ్స్‌లో వివిధ రకాల వెజిటేబుల్స్ చేర్చుతారు. ముఖ్యంగా సలాడ్స్‌లో టమోటో, కీరదోస, ఉల్లిపాయ వంటివి ఎక్కువగా ఉంటాయి.
 
ఇవి లో క్యాలరీలను కలిగివుండటం ద్వారా జలుబు, దగ్గును నివారిస్తాయి. శరీరంలో వ్యాధినిరోధకత తగ్గడం వల్ల సాధారణ జలుబు మరియు దగ్గు, ఇన్ఫెక్షన్లకు గురికావడం సహజం. కాబట్టి, వ్యాధినిరోధకతను చెక్ చేసుకుంటుండాలి.
 
అందుకు మీరు ఎక్కువ డైటరీ ఫైబర్‌ను తీసుకోవాలి. డైటరీ ఫైబర్ పచ్చి కూరల్లో ఎక్కువ లభ్యం అవుతుంది. వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మీరు తీసుకొనే ప్రతి మీల్స్‌తో పాటు సలాడ్స్‌ను అలవాటు చేసుకోవాలి.
 
బెర్రీస్, ఆపిల్ మరియు అరటి వంటి కొన్ని పండ్ల నేచురల్ డైటరీ ఫైబర్‌ను అందిస్తాయి. అంతే కాదు, వీటిలో క్యాలరీలు కూడా తక్కువే. ఈ డైటర్ ఫైబర్ వ్యాధినిరోధకతను మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. 
 
అందువల్ల, హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్‌ను మెయింటైన్ చేయడానికి రెగ్యులర్ డైట్‌లో పండ్లను చేర్చుకోవాలి. జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.