బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:48 IST)

విటమిన్‌ ''డి'' లోపం వలన క్యాన్సర్‌.. అధ్యాయనంలో వెల్లడి..!

మానవ జీవనశైలిలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక యూగంలో కేవలం కట్టు బొట్టు వ్యవహారాల్లో మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లు, జీవిత విధానాల్లోను అనేక విధాలుగా మార్పు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీంతో శరీరానికి విటమిన్ ''డి'' అందడం లేదు. ఈ కారణంగా అనేక విధాలైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా విటమిన్‌ ''డి'' లోపంతో క్యాన్సర్‌, గుండె జబ్బులు, షుగర్‌, మానసిక జబ్బులు, కీళ్లనొప్పులు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. విటమిన్‌ ''డి''ని మందుల రూపంలో తీసుకునే దానిన్నా  సహజసిద్ధంగానే ఎండ ద్వారానే సమకూర్చుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కనుక ప్రతి రోజూకు కనీస ఇరవై నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి తగిలే విధంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.