శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (19:08 IST)

మటన్ బోన్ సూప్ తాగడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందట!

మటన్ బోన్ సూప్ తాగడం ద్వారా బాగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. బోన్ సూప్‌లో గ్లైసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది బాగా నిద్రపట్టడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి గ్రేట్‌గా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఎముకల సూప్ త్రాగడం వల్ల మీరు శారీరకంగా మరియు మెంటల్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా వీక్ గా ఉన్నవారికి ఈ సూప్ ను అందిస్తే చాలా త్వరగా తేరుకుంటారు. బోన్ సూప్‌లో మినిరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడేవారికి ఈ బోన్ సూప్ చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది.
 
బోన్ సూప్‌లో క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది ఎముకలను హెల్తీగా ఉంచుతుంది . మరియు ఎముకల నుండి క్యాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది. 
 
ఒక కప్పు బోన్ సూప్‌ శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. బోన్ సూప్‌లో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం, గోళ్ళు, మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాంటి ప్రోటీన్‌ను చర్మం, హెయిర్, గోళ్ళలో కనుగొనబడినది. కాబట్టి, బోన్ సూప్‌ను త్రాగడం వల్ల చర్మం, గోళ్ళు, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్‌ను సప్లై చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.