శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (14:55 IST)

అసలు జుట్టు ఎందుకు ఊడుతుంది?

జుట్టు ఊడేందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. ప్రధానంగా ఒక వ్యక్తి మానసికంగా ఒత్తిడిలోనూ, విచారంలోనూ ఎపుడూ ఉన్నట్టయితే దాని ప్రభావం మన జుట్టుమీద పడుతుంది. ఆహార లోపం వల్ల రక్త క్షీణత. చాలా బలమైన మందులు వాడటం వల్ల రేడియేషన్ చికిత్స వల్ల జుట్టు ఊడిపోతుంది. 
 
ఆడపిల్లల్లో హార్మోన్ల ప్రభావం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. తలలో పేలు ఉండటం కూడా ఓ కారణంగా చెపుతున్నారు. శరీరంపై సొరియాసిస్ వంటి దీర్ఘ చర్మవ్యాధులతోనూ జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. 
 
కొన్ని రసాయనాలు, వేడి వస్తువులు తాకడం వల్ల కూడా జట్టు ఊడిపోతుంది. అలాగే, తలపైన కొంత మందిలో పెడిక్యూలస్ కొసిటస్ అనే పురుగు చిన్న చిన్న గుడ్లని పెడుతుంది. ఇది కిందకి, పక్కలకు వ్యాపించి మూలాన్ని చెరిచి జుట్టు ఊడటానికి కారణమవుతుంది.