గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:40 IST)

చింతచిగురు రోగ నిరోధక శక్తిని పెంచుతుందట!

పుల్లపుల్లగా ఉండే చింత చిగురు ఇచ్చే ప్రయోజనాలు తక్కువేం కాదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహద పడుతుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్, బీటా-కెరోటిన్‌ అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.

అలాగే క్యారెట్ కూడా ఇమునిటీని పెంచుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
క్యారెట్లో కెరోటిన్ హెచ్చు పరిమాణంలో ఉండటం ద్వారా స్నాక్స్‌ను పక్కనబెట్టేసి.. స్నాక్స్‌కు బదులు క్యారెట్ ముక్కల్ని తీసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. వీటితో పాటు తాజా కాయగూరలు, పచ్చని ఆకుకూరలు, తాజా పండ్లు ఆయా సీజన్లలో దొరికే పండ్లను తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.