మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (17:48 IST)

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరెంజ్ సూపర్ ఫ్రూట్!

మధుమేహ వ్యాధిగ్రస్తులు కేలరీలో తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి ఆహార నియమాలను అనుసరిస్తున్న సమయంలో నారింజ పండ్లను తీసుకోవచ్చు. క్యాలరీలపై అవగాహన కలిగివుండి కొంచెం కొంచెంగా ఆరెంజ్ తీసుకోవచ్చు. ఆరెంజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కారణం పండ్లు అధికంగా ఫైబర్, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్'లను కలిగి ఉంటాయి. నారింజలో ఉండే పోషకాలు మధుమేహ వ్యాధిగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 
నారింజ పండ్లు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్'ను కలిగి ఉంటాయి, ఇందులో విటమిన్ 'A','C','E', ల్యూటీన్, బీటా కెరోటిన్'లను కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహ వ్యాధి వలన కలిగే ప్రమాదాల నుండి రక్షిస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు గుండెపోటు, క్యాన్సర్, మరియు గుండె సంబంధిత వ్యాధుల వంటి ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాన్ని అధికంగా కలిగి ఉంటారు. 
 
కారణం ఈ వ్యాధిగ్రస్తులలో రసాయనిక ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది వీటిని 'ఆక్సిడేటివ్ స్ట్రెస్' అంటారు. కానీ నారింజలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ వీటికి వ్యతిరేకంగా పని చేస్తాయి, కావున మధుమేహ వ్యాధిగ్రస్తులకు నారింజ పండ్లు చాలా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.