శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:32 IST)

కమలాపండు కంటికి ఎంతో మేలు చేస్తుందట!

కమలాపండు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కమలా పండులో సిట్రస్ లిమినోయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. అలానే చర్మం, ఊపిరితిత్తులూ, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. ప్రతిరోజూ కమలా రసం తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనీతీరు మెరుగుపడుతుంది. 
 
ఈ పండులోని విటమిన్ ఎ కంటికి ఎంతో మేలు చేస్తుంది. కమలా పండులోని పీచు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో గుండెకు రక్తాన్ని సక్రమంగా సరఫరా చేసేందుకు దోహదం చేస్తుంది. ఈ పండులో వైరల్ ఇన్ఫెక్షన్‌ను నియంత్రించే పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.