శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (19:38 IST)

రక్తహీనతకు చెక్ పెట్టే.. ఈ 3 ఫుడ్స్ తీసుకోండి!

రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. బొప్పాయి జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అయితే బొప్పాయిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం మంచిది. 
 
అలాగే శరీరంలో ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచాలంటే.. దానిమ్మ పండును తీసుకోండి. దానిమ్మలో విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ డేంగ్యూ ఫీవర్‌తో పోరాడే లక్షణాలను ఫుష్కలంగా కలిగివుంటుంది.
 
ఇక మూడోది.. బీట్ రూట్ ప్లేట్ లెట్స్‌ను పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్, క్యారెట్‌ను వారానికి కనీసం రెండుసార్లైనా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.