శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (16:08 IST)

బొప్పాయి జ్యూస్‌తో వ్యాధి నిరోధకతను పెంచుకోండి.!

ప్రతిరోజూ ఒక గ్లాజు బొప్పాయి జ్యూస్‌తో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది  శరీరంలో వ్యాధినిరోధకత పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్న చిన్న రుగ్మతలు దరిచేరవు. 
 
అలాగే రోజూ ఒక గ్లాసుజు పపాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. బొప్పాయి జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేసే లక్షణాలున్నాయి. 
 
మొటిలమలను నివారించడానికి బొప్పాయి గుజ్జును చర్మానికి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. బొప్పాయిలోని పెపిన్ అనే ఎంజైమ్ డెడ్స్ స్కిన్ సెల్స్ తొలగించి మెరిసేటి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.