శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (17:23 IST)

మీరు హ్యాపీగా ఉన్నారా..? విచారంగా ఉన్నారా? అని అడిగితే..?

మీరు హ్యాపీగా ఉన్నారా..? విచారంగా ఉన్నారా? అని అడిగితే..? స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఏమో.. చెప్పలేను.. ఫర్వాలేదు.. తేల్చుకోలేకపోతున్నా .. వంటి సమాధానాలు చెబుతుంటే ఒత్తిడిలో ఉన్నట్టే అర్థమంటున్నారు... సైకాలజిస్టులు. ఇలాంటి పరిస్థితిలో అందుకు ఏయే అంశాలు కారణమో సమీక్షించుకుని, తగ్గించుకునే ప్రయత్నాలు చేయడమే మంచిది. 
 
బొమ్మలు వేయడం, గార్డెనింగ్, జిమ్‌కి వెళ్లడం, ఎంబ్రాయిడరీ చేయడం వంటి ఇష్టాలను దూరంగా ఉంచుకోవద్దు. ఒంటరిగా కూర్చుని గంటలపాటు ఆలోచించవద్దు. చేస్తున్న పని మంచిది కాదు. అది ప్రమాదంలోకి నెడుతుంది అని తెలిసినా దాన్ని చేస్తున్నారంటే అది ఒత్తిడి లక్షణాల్లో ఒకటి. దూకుడుగా బండి నడపడం, రన్నింగ్ బస్ ఎక్కడం అలాంటివే. విచారంగా ఉండటం, ఏడవటం మాత్రమే ఒత్తిడి లక్షణాలు అని అనుకుంటే పొరపాటే. కానీ కోపమే అసలైన ఒత్తిడి లక్షణమని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.