బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (18:18 IST)

రోజుకో గంట సేపు చదవండి...ఉత్సాహం పొందండి...!

నేటి ఆధునిక సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ కాళ్లకు చక్రాలు కట్టుకుని రోజూ పరుగులు తీస్తూనే ఉన్నారు. తద్వారా శారీరక శ్రమ, మానసిక అలసట, ఆందోళన, ఒత్తిడి వంటివన్నీ మెదడుపై అధిక ప్రభావం చూపించేవే. ఫలితంగా జీవనశైలిలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి నుంచి దూరం కావాలంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
 
జ్ఞాపకశక్తి పెరగాలన్నా, ఆలోచనలు పదునెక్కాలన్నా కనీసం రోజులో ఓ గంట సేపు చదువుకి కేటాయించాలి. నచ్చిన పుస్తకం, దిన పత్రిక, నవల ఇలా ఏదైనా కావొచ్చు.. చదవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మెదడుకు పదును. వీటికి తోడు కొంత సమయాన్ని ఆలోచనల్లో వేగం పెంచే పద వినోదం, సుడోకు, చెస్ వంటి వాటికి కేటాయించేలా ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా మానసిక అలసట, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చి ఉత్సాహాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.