శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (17:23 IST)

రెడ్ వైన్‌తో తల, మెడ క్యాన్సర్‌కు చెక్...!

ఇటీవల కాలంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. క్యాన్సర్ వ్యాధి రాక ముందే దాన్ని అడ్డుకోగలిగే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఆ విధంగా తల, మెడ క్యాన్సర్‌ల బారిన పడకుండా రెడ్ వైన్ మనల్ని రక్షిస్తుందని అధ్యయనకారులు అంటున్నారు. 
 
రెడ్ వైన్‌లో ఉండే రెస్‌ వెరా ట్రోల్, గ్రేప్ స్కిన్ పదార్థాలు కేన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయట. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని జన్యు కణాలు దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్న కరణాలను రెస్ వెరాట్రోల్ చంపేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ తాగడం, ఎఎల్ డిహెచ్ జన్యువు లోపించడం, డీఎన్ఎ దెబ్బతినడం వంటి కారణాల వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే కేన్సర్ ప్రమాదాన్ని రెస్‌ వెరాట్రోల్ శక్తి వంతంగా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కారకాలైన కణాలను రెస్ వెరాట్రోల్ నిర్మూలిస్తుంది. ఆల్కహాల్ వల్ల వచ్చే కేన్సర్ నివారణకు రెస్‌వెరాట్రోల్ సంజీవనిలా పని చేస్తుందని చెప్పలేం కానీ ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా కొంత వరకూ కేన్సర్ పాలబడకుండా ఇది మనల్ని కాపాడుతుందని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు.