గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (13:51 IST)

వివాహం ఆలస్యమైతే అష్ట కష్టాలు....

మనిషి జీవన శైలిలో ఏ పని అయినా తగిన సమయానికి జరిగిపోవాలి. లేదంటే సమస్యలు ఎదురుకావడం సర్వసాధారణం. అందునా వివాహం ఆలస్యంగా జరిగితే... అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
సాధారణంగా కొందరు వివాహానికి వయస్సు అడ్డంకి కాదంటారు. అయినా ఆలస్యంగా వివాహం చేసుకోవడం వలన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టం. వివాహం 25-30 ఏళ్ళ వయసు దాటితే ఆలస్యం అయిందని అనవచ్చు. 
 
పురుషులకైతే  30-35 మధ్య కూడా పెళ్లి వయసే. దీని మీద భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఏ వయసు ఆలస్యం అనేది మనం చెప్పలేం. కానీ, సాధారణ జనాభిప్రాయం ప్రకారం మగవారికి 35 పైనా, ఆడవారికి 30-32 పైనా అయితే ఆలస్యం అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎదుర్యయే అష్టకష్టాల గురించి తెలుసుకుందాం.
 
మీరు యవ్వనంలో వున్నప్పుడు చేయగలిగిన పనులు ఆలస్య వివాహంలో చాలా పెద్ద సమస్య. మీరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే యవ్వనంలోని ఉత్సాహం, ఆసక్తి దెబ్బతింటాయి. మీరు, మీ భాగస్వామి కలిసి చేయగల పనులు కూడా పరిమితంగానే వుంటాయి.
 
ఆర్ధిక విషయాలు మరీ ఎక్కువ ప్రాధాన్యం వహిస్తాయి. విడిగా అయినా ఆర్ధిక విషయాలు అప్రదానమైనవని కాదు. కానీ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, చాలా విషయాల కన్నా ఆర్ధిక ప్రణాళిక మరీ ముఖ్యం అయిపోతుంది.
 
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లల కోసం పడే తొందర కూడా మరో ఇబ్బంది. పిల్లల ప్రస్తావన తరచూ వస్తూనే వుంటుంది. పెళ్లయిన రెండు మూడు నెలల నుంచే పిల్లలు పుట్టరేమో అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. 
 
పెళ్ళికి ముందు చాలా కాలం మీరు మీ భాగస్వామితో బంధంలో వుంటే సరే. లేదంటే చాలా మంది వయసు దృష్ట్యా హడావిడిగా పెళ్లి చేసుకుంటారు, ఈ బంధం నుంచి ఏమి ఆశి౦చవచ్చో ఖచ్చితంగా తెలియకుండానే కాలం గడిపేస్తుంటారు. తద్వారా వివాహ బంధంలో పట్టు ఉండదు.
 
ఆలస్యంగా వివాహం అయితే ఒక వైపు ఉత్సాహం కోల్పోగా, మరో వైపు అనారోగ్య సమస్యలు వెంటాడడం కష్టతరంగా మారుతుంది. 
 
మీ స్నేహితుల పిల్లలు పెద్దవారిగా కనిపిస్తుంటే... మీకు మాత్రం ఇప్పుడే వివాహమైందని మీకు మీరే కొత్తగా కనిపిస్తుంటారు. 
 
పాట్నర్‌కు తగిన సమయాన్ని కేటాయించలేరు. మీకు ఆలస్యంగా పెళ్లి అయితే, తరచుగా మీ ఉద్యోగం చాలా ముఖ్యం అయిపోతుంది. ఎందుకంటే వయసు గడిచే కొద్దీ మీరు ఉద్యోగం మారడం కూడా కష్టం అయిపోతుంది, మీ ఉద్యోగం మీద మీరు మరీ ఎక్కువగా ఆధార పడతారు. దీంతో మీ ఉద్యోగం నుంచి వచ్చే సమస్యలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 
మరీ ముఖ్యంగా సెక్స్ కోరికలు తగ్గిపోవడం. సాధారణంగానే పెళ్లి అయినా, కాకపోయినా 35 ఏళ్ల వయసు మించితే సెక్స్ కోరికలు అందరికీ తగ్గిపోతాయి. మరి ఆలస్యంగా వివాహం చేసుకున్న జంటలో సెక్స్ కోరికల్లో విభేదాలు తలెత్తుతాయి.