బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (17:49 IST)

మధ్యాహ్నం పూట సలాడ్ తీసుకుంటే?

మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని నియంత్రించుకోవాలంటే భోజనానికి ముందు సలాడ్ తీసుకోండి. సలాడ్ ఎక్కువ మోతాదులో తీసుకున్న కెలోరీలు తక్కువగా ఉండటం ద్వారా ఒబిసిటీకి దారితీయదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ సలాడ్ తీసుకునే వారికి సి, ఇ, విటమిన్స్, ఫోలిక్  ఆమ్లం, లైకోపిన్, కెరొటినాయిడ్లు పుష్కలంగా అందుతాయి. వీటివల్ల ఆరోగ్య సమస్యల బారిన పడటం చాలామటుకు తగ్గిపోతుందని పరిశోధనలో తేలింది. 
 
అలాగే టోపును ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా తిన్నా.. పొట్ట నిండినట్టు అనిపించడం దీని ప్రత్యేకత. దీన్ని భోజనానికి ముందు తీసుకున్నా మంచిదే అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. సోయా పనీర్ కావడమే దీని ప్రత్యేకత. తద్వారా శరీరానికి పోషకాలు అందుతాయి. కొవ్వు సమస్య కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.