గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (20:50 IST)

ఎడమవైపు నిద్ర రోజంతా ఉత్సాహం..!!

మనం నిద్రించే తీరు మన జీవితంలో ఆనందాన్ని నిర్దేశిస్తుందంటున్నారు తాజా పరిశోధకులు. కుడి వైపు కన్నా ఎడమవైపు ఒత్తిగిలి నిద్రించే వారికి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని, వారి జీవితం ఆనందమయంగా ఉంటుందని ఆ సర్వేలో తేలింది. ఎడమవైపు తిరిగి పడుకునే వారు రాత్రుళ్లు సాధారణంగా నిద్రలేవరట. వారికి చక్కని గాఢనిద్ర పడుతుందని ఆ సర్వే నివేదిక చెబుతోంది.
 
కుడి వైపు తిరిగి పడుకునే వారి వదనం కళావిహీనంగా ఉంటుంది. అదే ఎడమవైపు పడుకునే వారి ముఖం ప్రకాశవంతంగా ఉంటుందట. కుడివైపు పడుకునే వారు ఉదయం నిద్రలేవడంతోనే చికాకుగా ఉంటారట. అలాగే ఆఫీసులో కూడా వారు అశాంతిగా ఉండి ఉద్యోగంపై దృష్టిని నిమగ్నం చేయలేరట.
 
అయితే ఎడమవైపు పడుకునే వారు ఆఫీసులో సంతోషంగా పనిచేస్తారు కాని కుడివైపు వారే బాగా గడిస్తారని ఈ సర్వే తేల్చింది. అలాగే కుడివైపు పడుకునేవారికి ఉద్యోగ జీవితం నచ్చదట. కాని ఎడమవైపు నిద్రించే వారు తాము చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తారట.
 
ఎడమ పక్క తిరికి పడుకునే వారు ఎంతటి గడ్డు పరిస్థితిలో అయినా నిబ్బరంగా ఉంటారట. అదే కుడివైపు పడుకునే వారు ఏ చిన్న కష్టం వచ్చినా కలవరపాటుకు గురై మానసికంగా కుంగిపోతారట. ఎడమవైపు పడుకునే వారు ఎప్పుడు ఉల్లాసంగా ఉండటమే కాక ఆశావాద దృక్పథంతో జివిస్తారట.
 
వీరిని కుడివైపు పడుకునే వారితో పోల్చితే ఎక్కువ బరువైన పనులు కూడా ఈజీగా చేసేస్తారట. అంతేగాక ఎంత కష్టపడినా త్వరగా అలసిపోరు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువే గాక వీరు పార్ట్ టైం ఉద్యోగాల కన్నా పర్మనెంట్ ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తారట.