మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:32 IST)

గంటకోసారైనా సీట్లో నుంచి లేవండి.. లేకుంటే?

గంటకోసారైనా సీట్లో నుంచి లేవండి.. లేకుంటే అకాల మరణం తప్పదంటున్నారు వైద్యులు. ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ద్వారా 52 శాతం మంది అకాల మరణం పాలవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇందులో 8 శాతం మంచి పెద్ద పేగు కేన్సర్, 10 శాతం మంది గర్భాశయ కేన్సర్, 6 శాతం మంది శ్వాసకోశ కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. 
 
రోజూ 14 నుంచి 18 గంటల పాటు కూర్చునే ఉండేవారు నిత్యం అరగంట పాటు బ్రిస్క్ వాకింగ్ లాంటి సాధారణ వ్యాయామాలు చేసినా ఫలితమేమీ ఉండదు. రోజకు ఏడు గంటలకు పైగా టీవీ ముందు కూర్చునే వారిలో దాదాపు 61 శాతం మంది తీవ్రమైన వ్యాధుల పాలవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. 
 
అందుకే రోజుకు గంట పాటు బాగా శ్రమ కలిగే వ్యాయామాలు చేయడంతో పాటు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారు గంటకు ఒకసారి కొంత దూరం నడవడం గానీ లేదా కనీసం లేచి నిలబడటం గానీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి.