గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (18:55 IST)

అల్సర్ ఉందా? ఐతే ఆరెంజ్, టమోటా తీసుకోకండి!

ప్రస్తుత కాలంలో చాలా మందిని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. చిన్న ప్రేగు, అన్నవాహిక మరియు కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్‌గా భావిస్తారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. 
 
వేళకు తీసుకోని ఆహారం, తీసుకున్నా హడా వుడిగా క్షణాల్లో ముగించటం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం.... వీటితో పాటు నిత్యం ఎదుర్కునే మానసిక ఒత్తిడి తోడుకావటంతో 'గ్యాస్ట్రిక్‌ అల్సర్‌' సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. అయితే ఆహార విధానంలో మార్పులతో అల్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్‌లో ఈ ఆహారం తీసుకోవాల్సిందే.. అదేంటే.. స్టొమక్ అల్సర్‌కు కారణం అయ్యే క్రిమిసంహారినిగా పెరుగులోని బ్యాక్టీరియా సహాయపడుతుంది. స్టొమక్ అల్సర్ తొలగించడానికి సహాయపడే అమైనో ఆసిడ్స్, ఎల్ గ్లుటమైన్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటాయి.
 
అల్సర్ నుండి ఉపశనం కలిగించడంలో అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులోని పిండి పదార్థాలు కడుపు మంటను చల్లార్చుతాయి. వీటిలో ఇంకా యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల అల్సర్‌కు కారణం అయ్యే బ్యాక్టీరియాను రూపుమాపడానికి, బాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి.ర్‌ను నిరోధించడం కోసం సిట్రస్ యాసిడ్ లేని ఆహారాలు తీసుకోడం అద్భుతమైన మార్గం. స్టొమక్ అల్సర్ తట్టుకొనేందుకు ఉపయోగపడే న్యూట్రీషియన్స్‌ను ఇది అందిస్తుంది. కాబట్టి అల్సర్ ఉన్న వారు, యాసిడ్స్ కలిగి ఉన్నటువంటి ఆరెంజ్, టమోటో, పైనాపిల్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.