గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (18:12 IST)

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఆమ్లెట్ తినండి!

మెదడు చురుగ్గా పనిచేయాలంటే ముందు కొబ్బరి బోండాం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని పకృతి సిద్ధమైన పదార్థాలు చాలా వరకు మెదడుకు మేలు చేస్తాయి. రక్త ప్రసారాన్ని పెంచుతాయి. ఫలితంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే మెదడుకు చేప కూడా చాలా మంచిది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులోని సారిడైన్, టూనాలు చాలా మెదడులోని సెల్స్‌ను చురుకుగా ఉండేలా చూస్తాయి. 
 
ఇకపోతే.. ఆమ్లెట్‌ కూడా చాలా మేలు చేస్తుంది. ఇందిలో యసిటైల్ కొలైన్ ఉంటుంది. సాధారణంగా ఇది తక్కువైతే జ్ఞాపకశక్తి కలిగి ఉండే కణాలలో చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆమ్లెట్ తినడం వలన యసిటైల్ కొలైన్ పెరిగి జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తవు. బీ-12 విటమిన్లు తగ్గడం వలన కూడా చాలా జ్ఞాపక శక్తి సెల్స్ నశిస్తాయి. కాబట్టి బీ-12ను ఆహార రూపంలో తీసుకోవాలి. అది సాధారణంగా మాంసం, కోడి, చేప, పాల ఉత్పత్తుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.