శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (17:49 IST)

క్యాన్సర్‌కు నో ఎంట్రీ ఇవ్వాలంటే.. రోజూ స్ట్రాబెర్రీస్ తినండి

రోజూ ఆపిల్ తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఈ విషయంలో స్ట్రాబెర్రీ ఆపిల్‌ను బీట్ చేస్తుందని అమెరికా పరిశోధకులు తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలిందంటున్నారు. స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతుంది. చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేసే స్ట్రాబెర్రీల్లో పీచుపదార్థాలెక్కువ. 
 
యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. తద్వారా డయాబెటిస్, క్యాన్సర్‌ను నిరోధించే శక్తి స్టాబ్రెర్రీస్‌కు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఈ పండ్లు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెపోటును నివారిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు రక్తకణాలను సైతం ఈ ఫ్రూట్స్ ఉత్పత్తి చేస్తాయి.