శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:26 IST)

బరువు తగ్గించే టమోటా : మహిళలు రోజూ ఒకటి తింటే..?

బరువు తగ్గించుకోవాలంటే.. మహిళలు తప్పకుండా రోజూ ఓ టమోటా పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూసేందుకు చాలా చిన్మదిగా కనిపించే టమోటా పండులో ఎంతో విలువైన గుణాలున్నాయి. టమోటాలు తింటే శరీరం బరువు తగ్గినట్టేనని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. టమోటాలు తినేవారు ఇతర పదార్థాలను పరిమితంగా తింటారని పరిశోధనలు తేల్చాయి. 
 
టమోటాలు తింటే కడుపు నిండినట్టు ఉండి ఎక్కువ అన్నంగాని, ఇతర పదార్థాలను తిననీయదు. కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. పలు ఇతర రకాల పదార్థాలను, టమోటాలను విడివిడిగా మహిళలకు ఇస్తూ జరిపిన ప్రయోగంలో టమోటాలు తిన్న మగువలు తక్కువగా ఆహార పదార్థాలు తిని బరువును నియంత్రించుకోవడం లేదా తగ్గించుకోవడం గమనించారనే విషయం ఇప్పటికే పరిశోధనల్లో తేలినట్లు న్యూట్రీషన్లు అంటున్నారు.