గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (15:23 IST)

ఆస్తమాకు చెక్ పెట్టాలా? టమోటా జ్యూస్ తీసుకోండి.!

రాత్రి నిద్రించేందుకు ముందు ఒక గ్లాసుడు టమోటా జ్యూస్ తీసుకుంటే టీబీ, ఆస్తమా వంటి వ్యాధులు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక గ్లాసుడు టమోటా రసంతో పాటు ఏలకుల పొడి కాసింత, ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకుంటే ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయి.

ఈ టమోటా జ్యూస్ తీసుకునేందుకు ముందుగా తొక్క తీసిన మూడు వెల్లుల్లిపాయలు మాత్రల్లా మింగేయాలి. తర్వాత టమోటా జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే ఆస్తమాను నయం చేసుకోవచ్చు. జలుబు తగ్గిపోతుంది. 
 
టమోటా జ్యూస్ లేదా టమోటాను అలాగే తీసుకున్నా ఫలితం ఉంటుంది. టమోటా వెంటనే రక్తంలో కలిసిపోవడం ద్వారా కొత్త శక్తి లభిస్తుంది. తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే కొన్ని హోటల్స్‌లో ముందుగా టమో జ్యూస్‌ను సర్వ్ చేస్తారు.

వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, మిరియాలు, ఉప్పును నువ్వులనూనెలో వేపి టమోటా సూప్‌తో కలిపి తీసుకోవచ్చు. టమోటాలో ఐరన్ శక్తి పుష్కలంగా ఉంది. తద్వారా రక్తహీనత దరిచేరదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.