శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 21 జనవరి 2015 (15:59 IST)

వృద్ధులకూ వ్యాక్సినేషన్‌ అవసరమే..!

రోగాలు దరిచేరకుండా ఉండేందు కోసం చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేయిస్తుంటాం. అదేవిధంగా వృద్ధులకు కూడా వ్యాక్సినేషన్‌లు చేయించాలని వైద్యులు తెలుపుతున్నారు. ఆరు పదుల వయస్సు దాటిన వృద్ధులను ఆరోగ్యపరంగా చూస్తే చిన్న పిల్లలతో సమానమంటున్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే, వృద్ధుల్లో కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
 
తద్వారా వృద్ధాప్యంలో వివిధ రకాల వ్యాధులు వస్తున్న నేపథ్యంలో వృద్ధులు వ్యాక్సిన్‌లు వేయించుకోవటం మేలంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా శీతాకాలంలో 60 ఏళ్లు దాటిన వారు ఫ్లూ, నిమోనియా లాంటి పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్‌లు వేయించుకోవటం ఉత్తమమంటున్నారు. 
 
ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలకు వచ్చిన విధంగానే, వృద్ధులకు కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు వస్తున్నాయి. వృద్ధులు నిమోనియా, ఫ్లూ, హెపటైటిస్ ఎ, బి, టెటానస్ లాంటి వ్యాక్సిన్‌లను వైద్యల సలహా మేరకు తీసుకోవటం ద్వారా వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా తప్పించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.