శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:08 IST)

భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగితే?

భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగడం వల్ల భోజనం సమయంలో తక్కువగా తినడానికి సహాయపడుతుందని.. తద్వారా బరువు తగ్గించుకోవడానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటర్‌తో బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారు, పొట్ట నిండా వాటర్‌తో నింపేయండి. ఒక రోజుకు కనీసం 4లీటర్ల కంటే ఎక్కువగా నీరు త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
 
ఆకలిగా ఉన్నప్పుడు? హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే, నీరు త్రాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు.