శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:10 IST)

పచ్చి బఠాణీ, స్ట్రాబెర్రీలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

పచ్చి బఠాణీల్లో విటమిన్ బి1, బి6, బి3 సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, లిపిడ్ జీవ ప్రక్రియకు ఎంతగానో అవసరమవుతాయి. ఇవి ప్రోటీన్, ఐరన్, సి విటమిన్‌లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇదే విధంగా హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ పండును ఉత్తమశ్రేణి ఫలాన్ని చేశాయి. 
 
స్ట్రాబెర్రీల్లోని ఫ్లేవనాయిడ్‌లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. వీటిలో మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ గుప్పెడు స్ట్రాబెర్రీలను మృదుపానీయాలు, మిల్క్ షేక్స్, సలాడ్స్‌లలో వేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.