శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (15:05 IST)

బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకు?

బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రెడ్‌ను ఏ రూపంలో తీసుకున్న శరీరానికి ఎటునంటి పోషణను అందించదు. ప్రోటీన్లు, విటమిన్లు తీసుకోవడం చేయాలి. గోధుమ బ్రెడ్లను లేదా పూర్తి ధాన్యం బ్రెడ్లను తీసుకొంటే ఎక్కువ మొత్తంలో కాకుండా కొన్ని పోషకాలను మాత్రమే అందిస్తుంది.
 
బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు గుండె వ్యాధులకు దోహదం చేసే సోడియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది.  బ్రెడ్‌ను ప్రతి రోజు అల్పాహారంగా తీసుకుంటే శరీరంలో ఉప్పు ఎక్కువ స్థాయిలో ఉండటానికి కారణమవుతుంది. బ్రెడ్‌ను బర్గర్లు, శాండ్విచ్లు రూపాల్లో ఎక్కువగా తీసుకోవటం వలన గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
 
బ్రెడ్‌లో చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండుట వలన వాటిని ప్రతి రోజు అల్పాహారంగా తీసుకుంటే మనం చాలా కేలరీలు తీసుకున్నట్టే అవుతుంది. కేకులు లేదా బర్గర్లు రూపంలో ఉన్నప్పుడు అదనంగా ఉప్పు లేదా శుద్ధి చేసిన చక్కెర ఉండటం కూడా బరువు పెరుగుట దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.