గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:53 IST)

భార్య రాణిస్తే భర్తకు ఈగో పెరిగిపోతుందా? అదే భార్యైతే..?

భార్య విజయం భర్త ఈగో దెబ్బతీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. తాను విఫలమైన రంగాల్లో తన భార్య, లేదా గర్ల్‌ఫ్రెండ్ రాణించడం అనేది.. మగాడు జీర్ణించుకోలేడని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ విషయం తేల్చడానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదు. కానీ శాస్త్రవేత్తలు సాధికారికంగా తేల్చిచెప్పారు. 
 
అది పురుషుల్లో ఇన్ఫీరియారిటీని కూడా పెంచుతుందిట. అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఈ విషయమై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ప్రత్యేకించి తాము విఫలమైన రంగాల్లో భార్యలు విజయం సాధిస్తే.. పురుషులు దానిని ఒక పట్టాన తట్టుకోలేరట. 
 
అయితే మహిళల విషయంలో ఈ తరహా స్పందన నిజం కాదని అదే అధ్యయనం చెప్తోంది. మహిళలు మాత్రం తమ భర్త ఎక్కువ సక్సెస్‌ సాధించినప్పుడు చాలా అదనపు ఆనందాన్ని ఫీలవుతున్నారట. 
 
భార్యల విజయం సందర్భాల్లో పురుషుల ఆత్మవిశ్వాసం కనిష్ఠ స్థాయికి పడిపోతుందని, భార్య సక్సెస్ అయితే ఆమె తనను ఇక లెక్కపెట్టదేమో అనే ఆందోళన పురుషుల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.